ఫోన్ కోసం డెలివరీ బాయ్ ని చంపేశాడు

Update: 2023-02-20 08:37 GMT

Full Viewఆ యువకుడి దగ్గర డబ్బులు లేవు. కానీ ఐ ఫోన్ కొనాలన్న కోరిక బలంగా ఉంది. అందుకు ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. ఫోన్ ఇంటికి వచ్చింది. కానీ డెలివరీ బాయ్ కు ఇవ్వటానికి అతని దగ్గర నగదు లేదు. బయటకు వెళ్లి డబ్బులు తీసుకొస్తానని డెలివరీ బాయ్ ని ఇంట్లో కూర్చోబెట్టాడు. తర్వాత లోపలి వచ్చి ఆ డెలివరీ బాయ్ ని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. చనిపోయిన ఆ బాయ్ ని మూడు రోజులు అలాగే బాత్రూం లో దాచిపెట్టాడు. తర్వాత బండి పై రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి అక్కడే దహనం చేశాడు.

                                  దీనికోసం మధ్యలో బాటిల్ లో పెట్రోల్ కొన్నాడు. ఈ ఘటన జరిగింది కర్ణాటక లోని హాసన్ జిల్లాలో. నాలుగు రోజులుగా డెలివరీ బాయ్ కనిపించకపోవడం తో అతని సోదరుడు పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీస్ లు రంగంలోకి దిగి కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించటంతో జరిగిన ఘోరం బయటకు వచ్చింది. సెకండ్ హ్యాండ్ ఐ ఫోన్ కోసం ఆర్డర్ పెట్టిన హేమంత్ దత్త ఈ మర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయన డెలివరీ బాయ్ డెడ్ బాడీ ని బండి పై తీసుకెళుతున్నట్లు గుర్తించారు.. ఈ వెంటనే హేమంత్ దత్త ను అరెస్ట్ చేశారు. 

Tags:    

Similar News