అర్ణాబ్ గోస్వామి కి చుక్కెదురు

Update: 2020-11-09 09:50 GMT

మధ్యంతర బెయిల్ కు నో

రిపబ్లిక్ టివీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణాబ్ గోస్వామికి ముంబయ్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలతో అర్ణాబ్ ను ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 4న ఆయన్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం అర్ణాబ్ గోస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయనకు బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టు ను సంప్రదించాల్సిందిగా హైకోర్టు సూచించింది.

ఇదిలా ఉండగా అర్ణాగ్ గోస్వామి జైలులో ఉన్న సమయంలో మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన జైలులో ఉండి ఫోన్ ఉపయోగించారనే అంశంపై పోలీసులు ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఒక జైలు నుంచి మరో జైలుకు తరలించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. జైలులో ఉన్న సమయంలో కూడా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా విచారణ ప్రారంభించారు.

Tags:    

Similar News