కీలక ఎయిర్ లైన్స్ డేటా చోరీ కలకలం

Update: 2021-03-08 05:25 GMT

ప్రపంచంలో ఏకంగా 400 ఎయిర్ లైన్స్ కు ఐటి సేవలు అందిస్తున్న సితా (ఎస్ఐటిఏ) నుంచి కీలక సమాచారం హ్యాక్ అయింది. పలు ఎయిర్ లైన్స్ కు సంబంధించి ప్రయాణికుల సంబంధించిన సమాచారాన్ని తస్కరించినట్లు నిర్ధారణ అయింది. సితా సంస్థ ప్రముఖ విమానయాన సంస్థలు అయిన సింగపూర్ ఎయిర్ లైన్స్, లుఫ్తాన్సా, ఎయిర్ న్యూజిలాండ్, జపాన్ ఎయిర్ లైన్స్ తదితర ప్రయాణికుల వివరాలు అందులో ఉన్నాయి. అయితే ఒక్కో ఎయిర్ లైన్స్ కు సంబంధించి హ్యాక్ అయిన సమాచారం వేర్వేరుగా ఉందని సితా ఒక ప్రకటనలో వెల్లడించింది.

తరచూ విమాన ప్రయాణాలు చేసే వారి సమాచారంపైనే హ్యాకర్లు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. సితా సంస్థ ఎయిర్ లైన్ పరిశ్రమకు సంబంధించి ప్రయాణికుల ట్రావెల్ ప్రణాళికలు, బుకింగ్, విమానాశ్రయాల నిర్వహణ; భద్రత, బ్యాగేజీ, ఎయిర్ క్రాఫ్ట్ కనెక్టివిటి, ఇన్ ఫ్లైట్ క్యాబిన్, కాక్ పిట్ ఆపరేషన్స్ కు సంబంధించి సేవలు అందిస్తుంది. స్విట్జర్లాండ్ లోని జెనీవా కేంద్రంగా ఈ సంస్థలు సేవలు అందిస్తుంది. జాతీయ మీడియాలో దీనికి సంబంధించి వార్తలు వెలువడ్డాయి.

Tags:    

Similar News