భారత్ లో ఎవరి దగ్గరాలేని ఈ బోయింగ్ ఖరీదు 1000 కోట్లు

Update: 2024-09-19 15:34 GMT

Full Viewపారిశ్రామిక వేత్తలు ప్రైవేట్ జెట్ విమానాలు కొనుగోలు చేయటం పెద్ద విషయం ఏమీ కాదు. ఇప్పటికే దేశంలోని చాలా మంది పారిశ్రామికవేత్తల దగ్గర ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అయితే దేశంలోనే నంబర్ వన్ సంపన్న పారిశ్రామికవేత్త అయిన ముఖేష్ అంబానీ అందరిలా ఉండాలి అని ఎందుకు అనుకుంటాడు. అందుకే ఆయన తన స్పెషాలిటీ చూపించారు. అదేంటి అంటారా?. ఆయన ఏకంగా బోయింగ్ 737 మాక్స్ 9 విమానాన్ని కొనుగోలు చేశారు. దేశంలో ఉన్న ఏకైక ఫస్ట్ ప్రైవేట్ బోయింగ్ విమానం ఇదే కావటం విశేషం. ఈ విలాసవంతమైన ప్రైవేట్ బోయింగ్ విమానం ఖరీదు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది. డెలివరీకి ముందే ఈ బోయింగ్ విమానాన్ని ముఖేష్ అంబానీ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్ధేందుకు స్విట్జర్లాండ్ పంపారు.

                                       అక్కడే అవసరమైన మార్పులు అన్ని చేశారు. మాములుగా అయితే బోయింగ్ 737 మాక్స్ విమానాలను ఎయిర్ లైన్స్ విదేశీ, దూర ప్రాంత సర్వీస్ లకు ఉపయోగిస్తాయి. అలాంటి భారీ విమానాన్ని ముఖేష్ అంబానీ ప్రైవేట్ జెట్ గా కొనుగోలు చేయటం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బోయింగ్ విమానంతో కలుపుకుంటే మొత్తం రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర ఉన్న మొత్తం ప్రైవేట్ జెట్స్ సంఖ్య పదికి చేరింది. ఇందులో రకరకాల విమానాలు ఉన్నాయి. రకరకాల పరీక్షల తర్వాత ఈ బోయింగ్ ప్రైవేట్ జెట్ ఇండియా కు ఆగస్ట్ లోనే చేరుకుంది. అయితే ఈ వార్త ఇప్పుడే బయకు వచ్చింది. ఈ బోయింగ్ ద్వారా ఒకే సారి (6355 నాటికల్ మైల్స్) నేరుగా 11 ,770 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న ఈ బోయింగ్ విమానం త్వరలోనే రిలయన్స్ హెడ్ క్వార్టర్ ముంబై కి చేరనుంది.

Tags:    

Similar News