కొడుకు విల్లా 640 కోట్లు ..తండ్రి విల్లా ఖరీదు 1,350 కోట్లు

Update: 2022-10-20 07:28 GMT

Full Viewదుబాయ్ కేంద్రంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ భారీ డీల్స్ చేస్తున్నారు. కొద్ది నెలల క్రితమే అయన తనయుడు అనంత్ అంబానీ పామ్ జుమ్మెరా ప్రాంతంలో 640 కోట్లు పెట్టి పది బెడ్ రూమ్స్తో కూడిన ఖరీదైన విల్లా కొన్నారు. ఇప్పుడు ముకేశ్ అంబానీ వంతు వచ్చింది. అయన ఏకంగా ఇదే ప్రాంతంలో 1,350 కోట్లు పెట్టి మరో విల్లా కొన్నారు. దుబాయ్ లో ఇప్పటి వరకు ఇదే పెద్ద డీల్ గా మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ఈ బీచ్‌ సైడ్‌ విల్లాను కువైట్‌కు చెందిన అల్షయా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ మహమ్మద్‌ అల్షయా నుంచి అంబానీ కొనుగోలు చేసినట్లు సమాచారం.  దుబాయ్‌ సముద్రతీరంలో ఖర్జూర చెట్టు ఆకారంలో ఏర్పాటు చేసిన కృత్రిమ దీవి ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల సెలబ్రిటీస్, పారిశ్రామికవేత్తలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గత ఏడాదిలో బ్రిటన్‌కు చెందిన స్టోక్‌ పార్క్‌ క్లబ్‌ను ముకేశ్‌ అంబానీ దాదాపు రూ.592 కోట్లకు దక్కించుకున్నారు. వరస పెట్టి విదేశాల్లో అంబానీ ఆస్తులు సమకూర్చుకోవటం పరిశ్రమ వర్గాల్లోనూ హాట్ టాపిక్ మారింది. 

Tags:    

Similar News