జూన్ 1న కేరళకు రుతుపవనాలు

Update: 2021-05-06 15:41 GMT

గుడ్ న్యూస్. ఈ సంవత్సరం కూడా రుతుపవనాలు సకాలంలోనే రానున్నాయి. ఇఫ్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం కేరళను జూన్ 1 నాటికి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేశారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ కూడా సాదారణ వర్షపాతం ఉంటుందనే నివేదికలు అందుతున్నాయని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో డిమాండ్ పెరుగుదలకు...వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాల ఆగమనంపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. సాధారణ రీతిలోనే జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది.

భారత వాతావరణ శాఖ ప్రకటనపై కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ స్పందించారు.నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తున్నాయని, జూన్ 1న కేరళను తాకి, ఆపై దేశంలో ప్రవేశిస్తాయని తెలిపారు. ఇది ముందస్తు సూచన అని వివరించారు. అధికారికంగా ఈ నెల 15న ప్రకటన ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కారణంగా నమోదయ్యే వర్షపాతం వివరాలపై ఈ నెల 31న అప్ డేట్ ఉంటుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News