సిబిఐ, ఈడీ లు వందల కోట్ల రూపాయల స్కాం లను సీరియస్ గా తీసుకుని విచారిస్తున్నాయి. ఇందులో తప్పు పట్టాలిసింది ఏమి లేదు. కానీ అదానీ విషయం లో మాత్రం ఎందుకు ఈ మౌనం అన్నదే ఇప్పుడు దేశం ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఢిల్లీ లిక్కర్ స్కాం పై చూపిస్తున్న స్పీడ్ అదానీ స్కాం పై ఎందుకు లేదు అన్నదే చర్చనీయాంశగా మారింది. లిక్కర్ స్కాం లో చేతులు మారిన ముడుపులు 100 కోట్లు గా చెపుతున్నారు. మొత్తం స్కాం విలువ..అదే ఖజానాకు వాటిల్లిన నష్టం మొత్తం కూడా సుమారు 2500 కోట్ల రూపాయలు. అదే అదానీ స్కాం విషయాన్ని వస్తే ఒక్క ఎల్ఐసి వంటి సంస్థే వేల కోట్ల రూపాయల మేర ఇప్పటికే నష్టపోయింది. ఇక ఇన్వెస్టర్ల సంగతి అయితే ఇక చెప్పక్కరలేదు. దేశంలో జరిగిన అది పెద్ద స్కాముల్లో ఇప్పుడు బయటపడిన అదానీ స్కాం ఒకటి అని అధికార వర్గాలు చెపుతున్నాయి. విదేశాల్లోని షెల్ కంపెనీలు...అక్రమ మార్గాల్లో నిధుల తరలింపు వంటి సంక్లిష్ట అంశాలు ఉన్న అదానీ స్కాం ను కేవలం నియంత్రణ సంస్థలకు వదిలేసి ఉరుకుంటే ఏమి జరుగుతుందో అందరికి తెలిసిందే. మరి సుప్రీమ్ కోర్ట్ ఈ విషయం లో ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. కేంద్రం మాత్రం అసలు దీని విషయం ఎలాంటి చర్యలకు సుముఖంగా ఉన్నట్లు కనిపించటం లేదు.