పెరగనున్న మొబైల్ చార్జీలు!

Update: 2023-02-28 07:52 GMT

Full Viewఒక వైపు పెరిగిన ద్రవ్యోల్బణం...మరో వైపు పెరుగుతున్న వడ్డీ రేట్లు..ఇప్పుడు మొబైల్ చార్జీల టారిఫ్ లు కూడా పెరగబోతున్నాయి. ఈ ఏడాది మధ్యలో మొబైల్ చార్జీల టారిఫ్ పెరిగే అవకాశం ఉంది అని భారతి ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ వెల్లడించారు. టెలికాం రంగంలో పెట్టుబడి పై వచ్చే రిటర్న్ చాలా తక్కువగా ఉంది అని అయన వ్యాఖ్యానించారు. చార్జీల పెంపు యూజర్లపై మరింత భారం వేసినట్లు కాదా అన్న ప్రశ్నకు ప్రజలు ఇతర అంశాలపై చేసే ఖర్చుకు ఈ పెంపు చాలా స్వల్పంగా ఉంటుంది అని తెలిపారు.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో మాట్లాడుతో అయన పలు అంశాలపై స్పందించారు. తమ కంపెనీ బ్యాలన్స్ షీట్ చాలా బలంగా ఉంది అని...ఇప్పుడు అదనంగా ఎలాంటి మూలధనం సమీకరించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పెట్టుబడిపై రిటర్న్స్ కోసం స్వల్పంగా చార్జీలు పెంచే అవకాశం ఉందని..ఇది 2023 లో మధ్యలో ఇది ఉంటుంది అని తెలిపారు. సహజంగా ఒక కంపెనీ చార్జీలు పెంచింది అంటే అదే బాటలో ఈ రంగం లోని ఇతర కంపెనీలు కూడా నిర్ణయాలు తీసుకుంటాయని విషయం తెలిసిందే.

Tags:    

Similar News