
ఒలంపిక్స్ పతకాల పట్టికలో భారత్ పేరు చేరింది. ఈ విశ్వ క్రీడలు ప్రారంభం అయిన రెండవ రోజు భారత్ బోణీ చేసింది. శనివారం నాడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తొలి పతకం తన ఖాతాలో వేసుకుంది. మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం గెలుచుకుంది.
స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి తొలి పతకం దక్కించుకుంది. మీరాబాయి ఒలంపిక్స్ లో తొలి పతకం సాధించటంపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీలు ఆమెకు అభినందనలు తెలిపారు.