సస్పెన్స్ వీడింది. రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యుల విన్నపాలు పలించాయి. ఐదు రోజుల నుంచి తమ చెరలో ఉంచుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల రాకేశ్వర్ సింగ్ తమ దగ్గర సురక్షితంగా ఉన్నాడని..విడుదలకు మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కొద్దిరోజుల క్రితం జరిగిన మావోయిస్టుల, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల అనంతరం రాకేశ్వర్ సింగ్ ను బందీగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే మధ్యవర్తుల అంశం ఇంకా తేలక ముందే మావోయిస్టుల రాకేశ్వర్ సింగ్ ను విడుడల చేశారు.. ఈ విషయాన్ని చత్తీష్ ఘడ్ ఐజి అధికారికంగా ప్రకటించారు.