మాజీ మంత్రి తనయుడి నిర్వాకం!

Update: 2025-02-13 11:43 GMT
మాజీ మంత్రి తనయుడి   నిర్వాకం!
  • whatsapp icon

ఇండియా నుంచి ప్రతి ఏటా బ్యాంకాక్ వెళ్లే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ చేతిలో లెక్కలేనంత డబ్బు ఉండటంతో వాళ్ళు ఈ ట్రిప్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి తనయుడు అంటే ఇక డబ్బుకు కొదవ ఏమి ఉంటుంది. ఫ్రెండ్స్ తో కలిసి ఏకంగా బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అయితే వీళ్ళు తమ బ్యాంకాక్ ట్రిప్ కోసం ఏకంగా స్పెషల్ ఫ్లైట్ ను ఎంగేజ్ చేసుకున్నారు. పూణే నుంచి ఇక ఛలో బ్యాంకాక్ అని బయలుదేరారు. మంత్రి తనయుడు తన తండ్రికి తెలియకుండా ఈ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఇక తాము బ్యాంకాక్ లో దిగటమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఈ ప్రత్యేక విమానం ఎక్కడ నుంచి బయలు దేరిందో అక్కడకే వచ్చి ల్యాండ్ అయింది. బయటకు వచ్చి చూసిన వీళ్ళు షాక్ కు గురి అయ్యారు.

                                                          అంతే కాదు వీళ్లకు ఎదురుగా పోలీస్ లు ఉండటం చూసి అవాక్కు అయ్యారు కూడా. సహజంగా విమానంలో ఏదైనా సమస్య వచ్చినా...ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నా కూడా అందులో ఉండే ప్రయాణికులకు సమాచారం ఇస్తారు. కానీ ఈ స్పెషల్ ఫ్లైట్ విషయంలో అలాంటివి ఏమి చేయకుండా గప్ చుప్ గా పని కానిచ్చేశారు. మహా రాష్ట్రకు చెందిన మాజీ మంత్రి తానాజీ సావంత్ తనయుడు రిషి రాజ్ ఈ ఘనకార్యం చేశాడు. ఇలా విమానం వెనక్కు రావటానికి ప్రదానం కారణం మంత్రి కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారు అనే ఫిర్యాదు రావటమే.

                                                 పోలీస్ లు వెంటనే డీజీసిఏ కు ఫిర్యాదు చేసి ఈ విమానాన్ని వెనక్కి రప్పించారు. రిషి రాజ్ కేవలం తన స్నేహితుల్లో కొంత మందినే ఈ ట్రిప్ కు తీసుకువెళ్లటంతో ఆగ్రహించిన ఫ్రెండ్స్ బ్యాచ్ లోని వాళ్లే అటు కిడ్నాప్ అంటూ పోలీస్ లతో పాటు మాజీ మంత్రికి కూడా సమాచారం అందించారు. అయితే వెనక్కి వచ్చిన తర్వాత తనను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని రిషి ఎంత మొత్తుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయ నేతల పిల్లలు ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఏకంగా స్పెషల్ ఫ్లైట్స్ లో విదేశలకు వెళ్లే రేంజ్ కు చేరుకోవటమే ఈ మొత్తం ఎపిసోడ్ లో హై లైట్ గా చెప్పుకోవచ్చు. బిజినెస్ ట్రిప్ అని చెప్పి స్పెషల్ ఫ్లైట్ ను వీళ్ళు బుక్ చేసుకున్నారు. గత సోమవారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News