ఎల్ ఐసి షేర్లు భారీ ప‌త‌నం

Update: 2022-06-13 08:44 GMT

భారీ హైప్ తో మార్కెట్లోకి ప్ర‌వేశించిన ఎల్ ఐసి ఇన్వెస్ల‌ర్లు ఎప్ప‌టికి కోలుకుంటారో తెలియ‌ని ప‌రిస్థితి. లిస్ట్ అయిన ద‌గ్గ‌ర నుంచి మ‌ధ్య‌లో ఒక‌ట్రెండు రోజుల మిన‌హా ఈ షేర్లు నేల‌చూపులు చూస్తూనే ఉన్నాయి. సోమ‌వారం నాడు కూడా ఈ కంపెనీ షేర్లు భారీ న‌ష్టాన్ని చ‌విచూశాయి. దీంతో భారీ లాభాలు ఆశించిన మ‌దుప‌ర్ల‌కు వాటి సంగ‌తి అలా ఉంచి భారీ న‌ష్టాల‌ను మిగిల్చాయి. గ‌త ప‌ది ట్రేడింగ్ సెష‌న్ల‌లో ఈ షేర్లు త‌గ్గుముఖం ప‌డుతూనే వ‌స్తోంది.

అయితే ఈ ప‌త‌నం తాత్కాలిక‌మే అని ప్ర‌భుత్వం త‌ర‌పున వివ‌ర‌ణ ఇచ్చినా కూడా ఇది ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. సోమ‌వారం నాడు ఎల్ ఐసీ షేర్లు బీఎస్ఈలో 691 రూపాయ‌ల‌తో ప్రారంభం అయ్యాయి. ఏకంగా 38 రూపాయ‌ల న‌ష్టంతో 670 రూపాయ‌ల క‌నిష్ట స్థాయికి చేరింది. దీంతో ఎల్ ఐసి మార్కెట్ క్యాప్ 4.35 ల‌క్షల కోట్ల రూపాయ‌ల‌కు ప‌త‌నం అయింది. 

Tags:    

Similar News