ఫస్ట్ టైం ...వెయ్యి రూపాయలు దాటిన ఎల్ఐసి షేర్లు

Update: 2024-02-05 14:01 GMT

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. తొలి సారి ఈ కంపెనీ షేర్లు లిస్టింగ్ ధరను అధిగమించాయి. అంతే కాదు...మొదటి సారి ఎల్ఐసి షేర్లు వెయ్యి రూపాయలు దాటటంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఏకంగా లిస్ట్ అయిన రెండేళ్ల తర్వాత ఎల్ఐసి ఈ రేట్ కు చేరుకోవటం ఇదే మొదటిసారి. ఎల్ఐసి 2022 జనవరి లో ఐపీఓ కు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం నాడు ఇంట్రా డే లో ఈ షేర్ 52 వారాల గరిష్ట స్థాయి 1028 రూపాయలకు చేరింది.

చివరకు మార్కెట్ క్లోజింగ్ లో 56 రూపాయల లాభంతో సరిగ్గా వెయ్యి రూపాయల వద్ద ముగిసింది. ప్రస్తుతం ఎల్ఐసి మార్కెట్ క్యాపిటలైజషన్ 6.32 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. గత కొంత కాలంగా ఎల్ఐసి షేర్ల కదలిక చూస్తే ఈ షేర్లు ఎట్టకేలకు గాడిన పడ్డాయనే నమ్మకం ఇన్వెస్టర్ల లో కలుగుతోంది. మరి ఈ నమ్మకాన్ని ఎల్ఐసి షేర్ నిలబెట్టుకుంటుందా...లేక మళ్ళీ సర్దుబాట్లు వస్తాయా అన్నది వేచిచూడాల్సిందే. 

Tags:    

Similar News