స్టాక్ మార్కెట్ లో లారస్ లాబ్స్ షేర్లు గత కొన్ని రోజులుగా దూకుడు మీద ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి కంపెనీ ఆర్థిక ఫలితాలు మరింత మెరుగ్గా ఉండటంతో ఈ కంపెనీ షేర్లు మంచి లాభాలను గడుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లారస్ లాబ్స్ షేర్లు గత కొన్ని రోజులుగా రోజుకో కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేస్తున్నాయి. తొలి త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో పాటు రాబోయే రోజుల్లో కూడా కంపెనీ పనితీరులో ఇదే జోష్ కొనసాగే అవకాశం ఉంది అనే అభిప్రాయంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ పై ఆసక్తి చూపిస్తున్నారు. బుధవారం నాడు ఈ షేర్లు ఒక దశలో ఎన్ఎస్ఈ లో 1856 రూపాయల గరిష్ట స్థాయిని తాకాయి. దీంతో ఫస్ట్ టైం లారస్ లాబ్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలకు టచ్ అయింది.

                                    మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంపెనీ మొత్తం షేర్లను ప్రస్తుత ధరతో లెక్కిస్తే వచ్చేదే. గత పదిహేను రోజులుగా కంపెనీ షేర్ వరసగా లాభాలు నమోదు చేయటంతో ఇప్పుడు లారస్ లాబ్స్ కంపెనీ లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ గల సంస్థగా అవతరించింది. రాబోయే రోజుల్లో కూడా ఈ కంపెనీ మెరుగైన పనితీరు కనపర్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు. 2026 జూన్ తో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలం కంటే 127 శాతం వృద్ధితో 362 కోట్ల రూపాయలకు చేరింది. అయితే బుధవారం నాడు మార్కెట్ క్లోజింగ్ లో ఈ షేర్ ధర ఎన్ఎస్ఈ లో 15 రూపాయల నష్టంతో 1835 రూపాయల వద్ద ముగిసింది. దీంతో మార్కెట్ క్యాప్ 99135 కోట్ల కు పరిమితం అయింది. అయితే రాబోయే రోజుల్లో లారస్ లాబ్స్ మార్కెట్ క్యాప్ లక్ష కోట్ల రూపాయల పైన కొనసాగటం ఖాయం అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Full View

Tags: