రోజుకో కొత్త గరిష్ట స్థాయికి లారస్ షేర్లు

Update: 2025-07-02 12:23 GMT

స్టాక్ మార్కెట్ లో లారస్ లాబ్స్ షేర్లు గత కొంత కాలంగా దూసుకెళుతున్నాయి. కొన్ని రోజులుగా ఈ షేర్లు రోజుకో కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. బుధవారం నాడు అంటే జులై 2 న కూడా మార్కెట్ లో ఇదే ట్రెండ్ కొనసాగింది. లారస్ లాబ్స్ షేర్లు బిఎస్ఈ లో పన్నెండు రూపాయల లాభంతో 757 రూపాయల వద్ద ముగిశాయి. ఒక దశలో 52 వారాల గరిష్ట స్థాయి 762 రూపాయలకు చేరాయి. గత కొన్ని రోజులుగా రోజుకో కొత్త 52 వారాల గరిష్ట స్థాయి ఈ షేర్లు చేరటంతో ఇన్వెస్టర్లు ఈ స్క్రిప్ పై దృష్టి సారించినట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి.

                            2025 మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి కంపెనీ మంచి పనితీరు చూపించటం..భవిష్యత్ అంచనాలు ఆశాజనకంగా ఉండటంతో ఈ స్క్రిప్ లాభాల బాటలో సాగుతోంది. మార్కెట్ అంచనాలను అధిగమించి మరీ ఈ షేర్ దూసుకెళుతుంది. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. మొత్తం మీద దేశంలో ఫార్మా రంగం పనితీరు ఆశాజనకంగా ఉండటం తో పాటు కంపెనీ పని తీరు మెరుగ్గా ఉండే అవకాశాలు ఉండటంతో ఈ కంపెనీ షేర్లు పెరుగుతున్నాయని చెపుతున్నారు.

Tags:    

Similar News