విమానంలో షాకింగ్ ఘటన

Update: 2023-08-17 10:48 GMT

Full Viewచిలీ దేశానికీ చెందిన ఎయిర్ లైన్స్ లాటమ్. ఈ ఎయిర్ లైన్ కు చెందిన ఒక విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఆ విమాన పైలట్ ఒకరు టాయిలెట్ లో కుప్పకూలి పోయి..తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ పరిణామంతో అప్రమత్తం అయిన కో పైలట్స్ విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. టాయిలెట్ లో పడిపోయిన పైలట్ కు సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించారు. అమెరికాలోని మియామి నుంచి చీలి రాజధాని శాంటి యాగోకు బయలుదేరిన విమానంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత పైలట్ ఇవాన్ ఆండోర్ అస్వస్థకు గురిఅయ్యారు. తర్వాత బాత్ రూమ్ కు వెళ్లి అక్కడ కుప్పకూలి పోయారు. వెంటనే సమీపంలో ఉన్న పనామా ఎయిర్ పోర్ట్ లో ఈ ఫ్లైట్ ను ల్యాండ్ చేశారు.

                                 మెడికల్ ఎమర్జెన్సీ టీం వచ్చి పరిశీలించి అప్పటికే పైలట్ చనిపోయినట్లు తేల్చారు. 56 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ పైలట్ గత 25 సంవత్సరాలుగా లాటమ్ ఎయిర్ లైన్స్ లో సేవలు అందిస్తున్నారు. అయన బోయింగ్ 787 -9 డ్రీం లైనర్ ఫ్లైట్ ను నడుపుతున్నారు. ఈ అనుకోని ఘటనతో ఇందులోని ప్రయాణికులను మరుసటి రోజు చిలీ కి చేర్చారు. అమెరికాలో పైలట్స్ 40 సంవత్సరాల లోపు వారు అయినా మెడికల్ సర్టిఫికెట్ ప్రతి ఏటా రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన వారు మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలని నిబంధన ఉంది. వందల మంది ప్రయాణికులు జీవితాలు పైలట్స్ చేతిలో ఉంటాయి కాబట్టి వీరి ఆరోగ్య ఫిట్ నెస్ విషయంలో ఎయిర్ లైన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అయినా అప్పుడపుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. పలు దేశాల్లో పైలట్ లు మద్యం తీసుకుని విధులకు వచ్చి బుక్ అయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

Tags:    

Similar News