గుండె బ్లాక్ లను మాయం చేసే కొత్త టెక్నాలజీ

Update: 2023-02-16 09:19 GMT

వైద్య శాస్త్రంలో నిత్యం కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అత్యంత కీలకమైన గుండె బ్లాక్ లను లేజర్ చికిత్సతో క్లియర్ చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఎక్కడైనా గుండెల్లో బ్లాక్ లు ఉంటే స్టంట్ లు వేసి వాటిని క్లియర్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఈ లేజర్ చికిత్సతో స్టంట్ లు వేయాల్సిన అవసరం ఉండదు అని చెపుతున్నారు. తాజాగా నాగపూర్ లో జరిగిన ఒక సదస్సులో డాక్టర్లు ఈ విషయం గురించి వెల్లడించారు. మేదాంత హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ప్రవీణ్ చంద్ర లేజర్ థెరపీ ద్వారా ధమనుల్లో ఉన్న బ్లాక్ లను తొలగించవచ్చు అని చెప్పారు. అత్యంత శక్తివంతమైన లైట్ ద్వారా ఈ పని పూర్తి చేస్తారు. గుండె నాళాలను ఏమాత్రం హాని చేయకుండా ఈ లేజర్ థెరపీ ద్వారా బ్లాక్ లను కరిగించే అవకాశం ఉందని తెలిపారు. ఈ చికిత్స తర్వాతా స్టంట్ లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ లేజర్ థెరపీ అనేది అతితక్కువ వ్యాప్తితో చేసే సర్జికల్ ప్రక్రియ అని తెలిపారు.

రక్త నాళాలను ఓపెన్ చేసి ఆక్సిజన్ తో కూడిన రక్తం సులభంగా ప్రసరించే ఏర్పాట్లు చేస్తారు. ఇది ఎక్కడైతే బ్లాక్ లు ఉన్నాయో అక్కడ వరకు వెళుతుంది. అక్కడ లేజర్ థెరపీ ద్వారా ఆ బ్లాక్ లను కరిగిస్తారు. లేజర్ సాంకేతికతను ఉపయోగించి తమ ఆస్పత్రిలో ఇప్పటికే 55 విజయవంతమైన చికిత్సలు చేసినట్లు తెలిపారు. బ్లాక్ లను తొలగించటానికి లేజర్ చికిత్స ఎంతో ఉపయోగపడుతుంది అని...కానీ ఎక్కడైనా స్టంట్ లు వేయాల్సిన అవసరం వచ్చినా కూడా బెలూన్ లు, స్టంట్ లను ఈ విధానం ఖచ్చితమైన పొజిషన్ చేయవచ్చు అని ప్రవీణ్ చంద్ర తెలిపారు. ఆంజియోప్లాస్ట్ చేసిన సమయంలో కొన్నిసార్లు రక్తనాళాల్లో ఇబ్బందులు వస్తాయని ...లేజర్ సాంకేతికతను వాడటం వాళ్ళ ఈ సమస్యలు చాలావరకు తగ్గుతాయని వెల్లడించారు. ఇది పేషెంట్స్ కు ఎంతో మేలు చేసే అంశం అని వెల్లడించారు.ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా లో దీనికి సంబదించిన ప్రత్యేక స్టోరీ ప్రచురితం అయింది.Full View

Tags:    

Similar News