అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అద్వానీ రథ యాత్ర చేసిన విషయం తెలిసిందే. దేశంలో బీజేపీ బలపటడానికి కూడా ఇదే ప్రధాన కారణం అనే అభిప్రాయం ఉంది. అలాంటిది అయోధ్య లో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అద్వానీకి భాగస్వామ్యం కల్పించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తొలుత అయన వయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఆహ్వానం ఇవ్వటం లేదు అని ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో తర్వాత ఆయనకు ఆహ్వానం పంపారు. అద్వానీ కూడా తర్వాత చలి కారణముగా తాను అయోధ్య వెళ్ళటం లేదు అని..తర్వాత మందిరాన్ని సందర్శిస్తాను అంటూ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.