అంతర్జాతీయంగా విమాన సర్వీసులపై ఆంక్షలు తొలగుతూపోతున్నాయి. తాజాగా భారత్ నుంచి కువైట్ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 7 నుంచే ఈ సర్వీసులు ప్రారంభం అయ్యాయి కూడా. నాలుగు నెలల తర్వాత కువైట్ భారత్ నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే భారత్ నుంచి కువైట్ వెళ్లాలనుకునేవారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆమోదించిన రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకుని ఉండాలి.
దీంతోపాటు 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. ప్రయాణికులు అందరూ Alhosn app ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆగస్టు 30 నుంచే యూఏఈ భారత్ తోపాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన వారికి టూరిస్ట్ వీసాల దరఖాస్తులను ఆహ్వానించింది. యూఏఈలోని పలు దేశాలు ఇప్పటికే భారత్ తోపాటు పలు దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించాయి.