కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక పూర్తి స్థాయి లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ వల్ల ఉపయోగం లేదని ..నిర్ధారించుకుని కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. మే 10 నుంచి 24 వరకూ కర్ణాటకలో లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. కర్ణాటకలో ముఖ్యంగా బెంగుళూరులో కేసులు అనూహ్యంగా పెరుగుతూ పోతున్నాయి.
లాక్ డౌన్ సమయంలో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ నిత్యావసర, కూరగాయల దుకాణాలకు మాత్రమేఅనుమతి ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో అన్ని హోటళ్ళు, పబ్బులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. ఉదయం పది గంటల తర్వాత బయట ఎవరినీ అనుమతించబోమన్నారు. ఇది తాత్కాలిక లాక్ డౌన్ మాత్ర అని..వలస కార్మికులు ఎవరూ రాష్ట్రం వీడి వెళ్లొద్దని కోరారు.