చేతిలో ఫోన్ లేనిదో ఏ పనీ ముందుకు సాగదు. తాజాగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ సేవలు కొద్ది గంటలు నిలిచిపోవటంతోనే యూజర్లు విలవిలలాడిపోయారు. ఇది మర్చిపోక ముందే దేశంలోని పలు ప్రాంతాల్లో జియో పోన్ల సేవలకు అంతరాయం కలిగింది. దీంతో యూజర్లు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తక్కువ ధరలకే డేటా అందుబాటులోకి తెచ్చిన జియో వైపు యూజర్లు భారీ ఎత్తున ఆకర్షితులైన విషయం తెలిసిందే. జియో వాడకందార్లలో ఎక్కువ మంది డేటాకే ఈ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ జియో వినియోగదారులు నెట్‌వర్క్‌లో సమస్యలు వచ్చాయంటూ ట్విటర్‌లో #Jiodown పేరుతో ట్రెండ్ చేస్తున్నారు.పలువురు జియో యూజర్లు డౌన్‌డిటెక్టర్‌లో నెట్‌వర్క్ డౌనైందని రిపోర్ట్‌చేశారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో డౌన్‌డిటెక్టర్‌కు గణనీయమైన రిపోర్టులు వచ్చాయి.
నెట్‌వర్క్ క్యారియర్ జియో నుంచి ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ , ఇండోర్ వంటి పెద్ద నగరాల్లో చాలా మంది జియో నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా ఉండడంతో యూజర్లు ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ట్వీట్‌లకు జియోకేర్ స్పందించింది. "మేము ప్రస్తుతం మీ లొకేషన్‌లో కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాము. మా టెక్నికల్ బృందం దానిపైనే పనిచేస్తోంది. వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరించబడతాయి. " అని ట్విటర్‌లో పేర్కొంది.