జెఫ్ బెజోస్ చేతికి 670 కోట్ల విమానం

Update: 2024-08-22 08:29 GMT

Full Viewఆయన విమానాలు కూడా కార్లు కొన్నట్లే కొంటున్నాడు. ఇప్పటికే ఆయన దగ్గర మూడు అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ జెట్ విమానాలు ఉండగా ఇప్పుడు నాల్గవ విమానం కూడా కొన్నాడు. ఆయనే జెఫ్ బెజోస్. ప్రపంచ సంపన్నుల్లో రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి. అమెజాన్ వ్యవస్థాపకుడు. జెఫ్ బెజోస్ తాజాగా గల్ఫ్ స్ట్రీమ్ జీ 700 జెట్ ను కొనుగోలు చేశారు. దీని ఖరీదు 670 కోట్ల రూపాయల పైమాటే. జెఫ్ బెజోస్ కొత్త విమానం కొనుగోలు చేసిన విషయాన్ని జెట్ స్పై వెల్లడించింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. జెఫ్ బెజోస్ దగ్గర ఉన్న విమానాల మొత్తం విలువే ఇప్పుడు ఏకంగా 1700 కోట్ల రుపాయల వరకు ఉంటుంది అని అంచనా. 

Tags:    

Similar News