మందు అమ్మ‌కాలు పెంచాలి..ఐడియాలు ఇవ్వండి

Update: 2022-08-18 16:11 GMT

Full Viewతెలుగు రాష్ట్రాల ఆర్ధిక వ‌న‌రుల్లో మ‌ద్యం ఆదాయం అనేది అత్యంత కీల‌కం అన్న విష‌యం తెలిసిందే. భార‌త్ లోని ప‌లు రాష్ట్రాల‌కు కూడా మ‌ద్యం అత్యంత ముఖ్య‌మైన ఆదాయ వ‌నరుగా ఉంది. తాజాగా ఓ దేశం మ‌ద్యం అమ్మ‌కాలు పెంచుకోవాలి..ఐడియాలు ఇవ్వండి అంటూ అక్క‌డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది. ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చేందుకు జ‌పాన్ మ‌ద్యం అమ్మ‌కాలు పెంచుకోవాల‌ని నిర్ణ‌యించింది.ప్ర‌జ‌లు మ‌రింత మ‌ద్యం సేవించేలా ఐడియాలు ఇవ్వ‌టానికి ఏకంగా పోటీలు పెట్టింది జ‌పాన్. జ‌పాన్ దేశానికి చెందిన జాతీయ ప‌న్ను ఏజెన్సీ (ఎన్ టిఏ) ఈ ప్ర‌చారానికి శ్రీకారం చుట్టింది. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌లు కొత్త అల‌వాట్లు చేసుకోవ‌టం వ‌ల్ల మ‌ద్యం అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా త‌గ్గి దేశానికి ప‌న్నుల రూపంలో వ‌చ్చే ఆదాయం త‌గ్గుముఖం ప‌ట్టింది.

స‌హజంగా ప్ర‌భుత్వాలు మ‌ద్యం అమ్మ‌కాల‌ను త‌గ్గించి..ఈ వ్య‌సనానికి బానిస‌లైన వారిని మార్చేందుకు ప్ర‌త్యేక కేంద్రాలు పెట్టాల‌ని కోరుకుంటారు ప్ర‌జ‌లు. కానీ స్వ‌యంగా ఓ దేశ‌మే మ‌ద్యం అమ్మ‌కాలు పెంచ‌టానికి ఏకంగా పోటీ పెట్ట‌డం విశేషం. క‌రోనా కార‌ణంగా గ‌త 31 సంవ‌త్స‌రాల్లో ఎన్న‌డూలేని రీతిలో జ‌పాన్ లో మ‌ద్యం అమ్మ‌కాలు త‌గ్గి ప‌న్నుల ఆదాయం పోయింది. ప‌క్క‌నుండే వారితో కూడా మ‌ద్యం తాగించేలా..ప్రోత్సహించేందుకు కొత్త ఐడియాల‌ను ఆహ్వానించారు. అనారోగ్యానికి కారణం అయ్యే మ‌ద్యం అమ్మ‌కాలు ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండ‌గా..మ‌రికొంత మంది మాత్రం త‌మ‌కు తోచిన ఐడియాలు చెబుతున్నారు. ప్ర‌జ‌లు త‌మ ఐడియాల‌ను సెప్టెంబ‌ర్ నెలాఖ‌రులోగా పంపాల‌ని ప్ర‌భుత్వం కోరింది.

Tags:    

Similar News