కూలీకి ఐటి శాఖ షాక్ .. 14 కోట్లు కట్టాలని డిమాండ్

Update: 2022-12-20 15:23 GMT

అయన పేరు మనోజ్ యాదవ్. రోజు కూలీ పనులు చేసుకునే వ్యక్తి. ఆయనకు ఐటి శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది అందులో 14 కోట్ల రూపాయల పన్ను చెల్లించాలని ఆదేశించింది. అంతే ఆ నోటీసు చూసి షాక్ కు గురైన మనోజ్ యాదవ్ ఇంటికి తాళం వేసి కుటుంబం తో సహా పరారు అయ్యాడు. ఐటి శాఖ అధికారులు మాత్రం అయన పేరుతో ఉన్న అకౌంట్ ల్లో భారీ ఎత్తున కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయని చెపుతున్నారు. మనోజ్ యాదవ్ కరోనా కు ముందు ఢిల్లీ , హర్యానా, పంజాబుల్లో కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేశాడు. ఆ తర్వాత బీహార్ వచ్చిన పనులు చేసుకుంటున్నాడు. ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే సమయంలో కంపెనీ ప్రతినిధులు పాన్, ఆధార్ కార్డు కాపీలు తీసుకున్నారని..వీటిని ఉపయోగించి వాళ్ళే బ్యాంకు ఖాతాలు తెరిచి ఉంటారని యాదవ్ అనుమానం వ్యక్తం చేశాడు. తనకు ఉన్న ఆస్తులు ఎన్ని సార్లు అమ్మినా కూడా ఐటి శాఖ జారీచేసిన నోటీసుకు డబ్బు కట్టలేనని వాపోతున్నాడు. మరి ఐటి శాఖ ఈ విషయాన్నీ ఎలా పరిష్కరిస్తోందో చూడాలి. బీహార్లో నోటీసులు ఇవ్వటానికి యాదవ్ ఇంటికి వెళ్లిన ఐటి శాఖ అధికారులు కూడా అక్కడ పరిస్థితి చూసి షాక్ కు గురయ్యారు.

Tags:    

Similar News