టోల్ ఆదాయం 2030 నాటికీ 1 .30 లక్షల కోట్లు

Update: 2023-06-28 07:17 GMT

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ కలిగిన దేశంగా ఇండియా అవతరించింది. ఇటీవల వరకు చైనా రెండవ స్థానంలో ఉండగా..ఇప్పుడు ఇండియా ఆ ప్లేస్ ను ఆక్రమించింది. అతి పెద్ద రోడ్ నెట్ వర్క్ తో అగ్రరాజ్యం అమెరికా మొదటి ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం ఇండియా లో 1 ,45 , 240 కిలోమీటర్ల హై వే లు ఉన్నాయి. అదే అమెరికాలో 2,60,000 కిలోమీటర్ల హై వేస్ ఉన్నాయి. గత తొమ్మిదేళ్ల కాలంలో రోడ్ నెట్ వర్క్ 59 శాతం మేర పెరిగింది. ఇది 2013 -14 సంవత్సరాల కాలంలో 91287 కిలోమీటర్లు మాత్రమే ఉంది అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

అదే సమయంలో టోల్ ద్వారా వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్ లో పెరిగింది. 2013 -14 సంవత్సరాల కాలంలో టోల్ ఆదాయం 4770 కోట్ల రూపాయలు ఉండగా...ఇప్పుడు అది 41342 కోట్ల రూపాయలకు పెరిగింది. 2030 సంవత్సరం నాటికీ టోల్ ఆదాయాన్ని 130000 కోట్ల రూపాయలకు పెంచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఎన్ హెచ్ ఏఐ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏడు ప్రపంచ రికార్డు లు నమోదు చేసింది. ఈ సమయంలో ఎన్నో ఎక్స్ ప్రెస్ వేస్ తో పాటు పలు కొత్త ప్రాజెక్ట్ లను అభివృద్ధి చేసింది అని తెలిపారు. 

Tags:    

Similar News