సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది మంచి కంటే చెడు కే ఎక్కువ ఉపయోగ పడుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. రాజకీయ పార్టీలు...పార్టీల సైన్యం ప్రవేశించాక ఇది మరింత దారుణంగా మారిపోయింది. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అబద్దాలు ప్రచారం చేయటంలో మాకేమి తక్కువ అంటూ ముందు వరుసలో ఉంటున్నారు. సోషల్ మీడియా కు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటి అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ను వాడుతున్న వారి సంఖ్య 500 కోట్లు. పైగా వీళ్ళు అంతా చురుగ్గా సోషల్ మీడియా ను వాడుతున్న వాళ్లే. ప్రస్తుత ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే అన్ని రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో కలుపుకుని 500 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇండియాలో ఒక్కో యూజర్ రోజుకు రెండున్నర గంటల సమయాన్ని ఇందులో వినియోగిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా సోషల్ మీడియాను వాడేది బ్రెజిల్ దేశస్థులు. వాళ్ల వినియోగం రోజుకు 3 .49 గంటలు ఉంది..జపాన్ లో మాత్రం ఇది రోజు కు గంట కంటే తక్కువగా ఉండటం విశేషం.