గత కొన్ని సంవత్సరాలుగా భారత పౌరసత్వం వదులుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అదే ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. 2023 సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో అంటే జూన్ వరకే 87 వేల మంది దేశ పౌరసత్వం వదులుకున్నారు. అదే సమయంలో 2011 నుంచి ఇప్పటివరకు 17.5 లక్షల మంది పౌరసత్వం వదులున్నారు. ఇందులో ఎక్కువ మంది సంపున్నులే ఉన్నారు. వివిధ రకాల కారణాలతో వీలు దేశ పౌరసత్వం వదులుకుని విదేశాల్లో స్థిరపడుతున్నారు.
వ్యక్తిగత సౌకర్యాల కోసం వీళ్ళు అలా చేస్తున్నారు అని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ వెల్లడించారు. భారత్ లో ద్వంద పౌరసత్వం అమలులో లేనందున విదేశాల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వారు ఇక్కడ పౌర సత్వం వదులుకుని వాళ్ళు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారా ఆ దేశాల్లో పర్మినెంట్ రెసిడెంట్ హోదా పొందుతున్నారు.