ముఖ్యంగా ఐటి రంగం కొత్త నైపుణ్యాలను కలిగిన వాళ్లపై కూడా ఫోకస్ పెడుతున్నాయి. మారుతున్నా ట్రెండ్ కు అనుగుణంగా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరచుకునే వాళ్ళకే ఐటి రంగంలో మెరుగైన అవకాశాలు దక్కుతాయని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. మొత్తానికి ఇండియా ఐటి జాబ్ మార్కెట్ లో రికవరీ స్టార్ట్ అవటం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది చివరికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా పూర్తి కానున్నాయి. ఆ తర్వాత అక్కడ కూడా జాబ్ మార్కెట్ జోష్ అందుకునే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇప్పటికే కొంత మేర పరిస్థితి మెరుగు అయినట్లు సమాచారం. గత కొంత కాలంగా అమెరికా లో ఎంఎస్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తీసి వేయటం తప్ప...కొత్త ఉద్యోగాలు లేని పరిస్థితి ఇప్పటి వరకు అక్కడ కూడా . త్వరలోనే అమెరికా లో కూడా జాబ్ మార్కెట్ గాడిన పడుతుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి.