మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకూ పరిమిత సంఖ్యలో నమోదు అవుతూ వస్తున్న కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదు అవుతోంది.ఇటీవల వరకూ దేశంలో కరోనా కేసుల సంఖ్య పది వేల దిగువనే కొనసాగుతూ వచ్చింది. కానీ అకస్మాత్తుగా తాజా కేసులు భా 13,154కి చేరాయి. కరోనాతో 268 మంది మృతి చెందారు. అదే సమయంలో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961 కి చేరింది. మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగటంతో భారత్ లో మరో వేవ్ ప్రారంభం అయిందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 263 ఒమిక్రాన్ కేసులు ఉండగా. మహారాష్ట్రలో 251 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ లో 97, రాజస్థాన్ లో 69, కేరళలో 65, తెలంగాణలో 62 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. అయితే సానుకూల అంశం ఏమిటంటే ఒమిక్రాన్ బాధితులుగా గుర్తించిన వారిలో మెజారిటీ ప్రజలు అత్యంత సాదాసీదాగా ఉండటం ఊరట కల్పించే పరిణామం. కొంత మందిలో మాత్రమే స్వల్ప లక్షణాలు కన్పిస్తున్నాయి.