డెబ్బ‌యి వేల‌కు క‌రోనా కేసులు

Update: 2021-06-14 04:48 GMT

 దేశంలో క‌రోనా రెండ‌వ ద‌శ ముగిసే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌న్పిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న కేసుల సంఖ్యే ఇందుకు నిద‌ర్శ‌నం. ప‌లు రాష్ట్రాల్లో కేసులు బాగా త‌గ్గ‌టంతో ఇప్ప‌టికే అంద‌రూ అన్ లాక్ పై ఫోక‌స్ పెట్టి అమ‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 75 రోజుల తర్వాత కరోనా కేసులు 70 వేలకు దిగొచ్చాయి. గత 24 గంటల్లో భారత్‌లో 70,421 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్ ద్వారా వెల్ల‌డించింది.

గడిచిన 24 గంటల్లో 3,921 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. ఇక 1,19,501 మంది క‌రోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు దేశంలో 2,81,62,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 9,73,158 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

Tags:    

Similar News