ధరల శ్రేణి రూ 1865 నుంచి 1960 రూపాయలు

Update: 2024-10-09 08:22 GMT

దేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఐపీఓ మార్కెట్ లోకి రాలేదు. ఇప్పటి వరకు అతి పెద్ద ఐపీఓ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఎల్ఐసి) ఐపీఓనే. ఎల్ఐసి మార్కెట్ నుంచి 21000 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇప్పుడు హ్యుండయ్ మోటార్ ఇండియా ఏకంగా 27870 కోట్ల రూపాయలు సమీకరించేందుకు మార్కెట్లోకి వస్తోంది. ఈ ఇష్యూ వివరాలను కంపెనీ ప్రతినిధులు బుధవారం నాడు మీడియా కు వెల్లడించారు. వాస్తవానికి హ్యుండయ్ ఇష్యూ సైజు 25000 కోట్ల రూపాయలుగా ప్రచారం జరిగింది. కానీ ఈ మొత్తం 27870 కోట్ల రూపాయలు గా ప్రకటించారు.  ఈ ఐపీఓ అక్టోబర్ 15 న ప్రారంభం అయి...ఆక్టోబర్ 17 న ముగియనుంది. 

                                               ఒక్కో షేర్ ధరను 1865 రూపాయల నుంచి 1960 రూపాయలుగా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఒకొక్కరు కనీసం ఏడు షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కనీస పెట్టుబడి 13720 రూపాయలు. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 14 కోట్ల పైన షేర్లను జారీ చేయనుంది.  అక్టోబర్ 17 న ఇష్యూ ముగిసిన తర్వాత హ్యుండయ్ షేర్లు బిఎస్ఈ, ఎన్ఎస్ఈ లో అక్టోబర్ 22 న లిస్ట్ కానున్నాయి. గత కొంత కాలంగా ప్రైమరీ మార్కెట్లో ఐపీఓలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దేశంలో రెండవ అతి పెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న హ్యుండయ్ ఇండియా మోటార్ ఐపీఓ కు కూడా దుమ్ము రేపే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. దక్షిణ కొరియా తర్వాత హ్యుండయ్ భారత్ లోనే ఐపీఓకి వస్తోంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను కంపెనీ దేశంలోని తన యూనిట్ల విస్తరణ తో పాటు ఇతర అవసరాలకు ఉపయోగించనుంది.

Tags:    

Similar News