నిరుద్యోగ రేటు 3.6 శాతానికి తగ్గింది అంటే ఇది ఎంత మాత్రం మాంద్యానికి దారితీసే ఛాన్స్ లేదన్నది ఆయన వాదన. ఏది ఏమైనా వరసగా రెండు త్రైమాసికాలు అగ్రరాజ్యం అమెరికా జీడీపీ తగ్గుతూ వస్తున్నందున ఎన్ ఆర్ ఐలు..ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కొత్త పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు..అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల రికార్డు స్థాయికి చేరుకోవటంతో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతూ పోతుంది. దీంతో అక్కడ తొలిసారి జీవన వ్యయం పెరిగిన సెగను ప్రజలు చవిచూస్తున్నారు. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే మాంద్యం భయం పోవటానికి.పెరిగిన వడ్డీ రేట్లు తగ్గటానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున ఎన్ ఆర్ఐలు ఎవరూ తొందరపడి కొత్త పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్ళరని..ఇది ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ప్రభావం చూపించే అంశమే అని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు.