ఐటి రిటర్న్స్ ... ఎక్కువ మందికి ఐదు లక్షలే

Update: 2023-08-07 11:09 GMT

Full Viewజనాభా విషయం లో భారత్ ఈ మధ్యే చైనా ను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించింది. జనాభా విషయంలో ఇప్పుడు ఇండియా నే నంబర్ వన్. తాజాగా వచ్చిన డేటా ప్రకారం చూస్తే దేశ జనాభా 142 .86 కోట్లు. 2023 జులై 31 తో దేశంలోని దేశ ప్రజలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు తుది గడువు అన్న విషయం తెలిసింది.2023 మార్చి తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6 .77 కోట్ల మంది పైనే ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు. తాజాగా దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.గత ఆర్థిక సంవత్సరంలో దేశ జనాభాలో కోటి రూపాయల పైన ఆదాయం కలిగిన వ్యక్తులు కేవలం 1 .69 లక్షల మంది మాత్రమే.

                                              ఇవి వారు దాఖలు చేసిన రిటర్న్స్ ఆధారంగా వెల్లడించారు. ఐదు లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారు 4 .65 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేశారు. ఐదు నుంచి పది లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారు కోటి పది లక్షలు ఉంటే...పది నుంచి ఇరవై లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారు 45 .54 లక్షల మంది రిటర్న్స్ వేశారు. దేశ జనాభా సంఖ్య..ఈ ఐటి రిటర్న్స్ సంఖ్య చూస్తే దేశంలోని మెజారిటీ ప్రజల ఆదాయం ఐదు లక్షల రూపాయల లోపే ఉంది అని స్పష్టం అవుతోంది. 

Tags:    

Similar News