టెక్ మహీంద్రా సీఈఓ సి పీ గుర్నాని 30 కోట్ల రూపాయల వేతనం తీసుకుంటుంటే..టిసిఎస్ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాథన్ 29 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాఫోర్జ్ సీఈఓ సుధీర్ సింగ్ వేతనం 33 .94 కోట్లు పొందినట్లు రికార్డు వెల్లడిస్తున్నాయి. ఇతర రంగాలతో పోలిస్తే ఐటి కంపెనీల సీఈఓ లు అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళ వేతనాలు అధికంగా ఉంటాయని చెపుతున్నారు. జెరోధా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్, నితిన్ కామత్ లు ఒక్కొక్కరు 75 కోట్ల రూపాయల వేతనం తీసుకున్నారు. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వార్షిక వేతనం 12 కోట్ల రూపాయలు ఉంది. మరో మాటలో చెప్పాలంటే నాయకత్వ బాధ్యతలకు ఇస్తున్న ప్రతిపలంగానే వీటిని చూడాల్సి ఉంటుంది.