చదువు ఒత్తిడే కారణం!

Update: 2023-09-19 04:19 GMT

హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం. అయన కుమార్తె మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆత్మహత్య చేసుకుంది. బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన విషయం తెలిసిందే. ఆయన కూతురు మీరా (16) ఆత్మహత్యకు పాల్పడటంతో విజయ్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం ఇంట్లో సభ్యులు చూసి హుటాహుటిన మీరాను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ మీరా ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. చెన్నైలోని చర్చి పార్క్ కాలేజ్‌లో మీరా ఇంటర్ సెంకడియర్ చదువుతోంది. ఒత్తిడి కారణంగానే మీరా ఆత్మ హత్య చేసుకున్నట్లు చెపుతున్నారు. విజయ్ ఆంటోని ఫాతిమా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. ఒకరు మీరా అయితే, మరో అమ్మాయి లారా. విజయ్ కుటుంబం చెన్నైలోని డీడీకే రోడ్డులో నివాసం ఉంటోంది.

విజయ్ ఆంటోని కూతురి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వరస ప్రాజెక్ట్ లతో విజయ్ ఆంటోనీ ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ చదువు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవటం వల్లే ఆమె ఈ దురాగతానికి పాల్పడినట్లు చెపుతున్నారు. కుటుంబ సభ్యుల నిరంతర పర్యవేక్షణ లేకపోతే ఒత్తిడిని ఎదుర్కొనే వారు ఇలాంటి దారుణాలకు పాల్పడే అవకాశం ఉంది అని నిపుణులు చెపున్నారు. కానీ ఈ స్పీడ్ యుగంలో కొంత మంది పేరెంట్స్ మరీ పిల్లల విషయాలను కూడా పట్టించుకోలేని అంత బిజీగా జీవితాలను గడుపుతున్నారు.

Tags:    

Similar News