వచ్చే ఏడాది నాలుగు వందల కోట్లకు విమాన ప్రయాణికులు

Update: 2022-12-07 09:03 GMT

Full Viewప్రపంచ విమానయన రంగం 2023 లో లాభాల బాట పట్టనుంది. అంతర్జాతీయ విమాన రవాణా సమాఖ్య (ఏటిఐఏ) వెల్లడించింది. 2019 తర్వాత ఈ రంగం లాభాల బాట పట్టనుండటం ఇదే మొదటి సారి అవుతుంది. కరోనా కారణంగా ప్రపంచ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల (4 బిలియన్ ) మంది రాకపోకలు సాగిస్తారని ఏటిఐఏ అంచనా వేసింది. ఇదే సమయంలో విమానయాన సంస్థల లాభాలు కూడా 4 .7 బిలియన్ డాలర్లు గా ఉంటుందని తెలిపింది.

                                       2022 లో విమానయాన రంగం నష్టాలు ముందు అనుకున్న 9 .7 బిలియన్ డాలర్ల కంటే తగ్గి,6 .9 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతాయని లెక్కలు వేశారు. అయితే ప్రభుత్వాలు వేసే పన్నులు, మౌలికవసతుల ఫీజు ల వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చైనా క్రమక్రమంగా అంతర్జాతీయ ట్రాఫిక్ ను అనుమతిస్తున్నందున ఈ అంచనాకు వచ్చారు. ఒక వేళ ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తే మాత్రం లాభాలు తగ్గుతాయని చెపుతున్నారు. అదే సమయంలో ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉండనే అంశాలను కూడా చూడాల్సి ఉందని చెపుతున్నారు.

Tags:    

Similar News