భారీ బ్లాక్ డీల్ కూడా!

Update: 2025-11-18 13:56 GMT

స్టాక్ మార్కెట్ లో వరసగా ఆరు రోజుల లాభాలకు మంగళవారం నాడు బ్రేక్ పడినా కూడా జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ షేర్లు మాత్రం లాభాల బాటలో సాగాయి. అంతే కాదు ఈ షేర్లు ఏకంగా 52 వారాల గరిష్ట స్థాయి 105 రూపాయలకు చేరాయి. బిఎస్ఈ లో ఈ షేర్లు ఆరు రూపాయల లాభంతో 103 .74 రూపాయల వద్ద క్లోజ్ అయ్యాయి. ఒక్క రోజులో జీఎంఆర్ షేర్లు ఆరు రూపాయలు పెరిగింది ఈ మధ్య కాలంలో ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. ఒక్క బీఎస్ఈ లోనే 60 .80 లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ కంపెనీ షేర్ల ధర పెరగటంతో ఇప్పుడు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,09,538 కోట్ల రూపాయలకు చేరింది. మంగళవారం నాడు మార్కెట్ ప్రారంభానికి ముందే జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కౌంటర్ లో బ్లాక్ డీల్ కింద 4 .55 కోట్ల (45 .5 మిలియన్ షేర్లు) చేతులు మారినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

                                               అయితే ఎవరు వీటిని అమ్మారు...ఎవరు కొనుగోలు చేశారు అనే వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. 2025 సెప్టెంబర్ తో ముగిసిన మూడు నెలల కాలానికి కంపెనీ ఒకింత మెరుగైన ఫలితాలు ప్రకటించటంతో ఈ కౌంటర్ లో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. 2025 అక్టోబర్ నెలలో ఎయిర్ ట్రాఫిక్ వివరాలు కంపెనీ వెల్లడించిన తర్వాత పలు బ్రోకరేజ్ సంస్థలు జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ షేర్ కొనుగోలుకు సిఫారసు చేశాయి. కోటక్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ పోర్ట్ పోలియో లో ఈ షేర్లు యాడ్ చేసుకోవొచ్చు అని సిఫారసు చేయగా...జెఫరీస్ మాత్రం బై సిఫారసు చేసింది. ఈ సంస్థలు రెండూ వరసగా జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ షేర్ ధర 107 , 115 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది అని అంచనాలు వేశాయి.

Tags:    

Similar News