అమెరికాలో 50 శాతం వ్యాక్సినేషన్ పూర్తి

Update: 2021-05-26 04:27 GMT

వ్యాక్సినేషన్ విషయంలో అమెరికా చాలా ముందడుగు వేసింది. దేశంలోని పెద్దల్లో (అడల్ట్) 50 శాతానికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి అయిందని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వెల్లడించారు. ఇది పెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు. అదే సమయంలో వ్యాక్సిన్ వేసుకునే వారికి ప్రభుత్వం పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తోంది. ఒకప్పుడు కరోనాతో అల్లకల్లోలం అయిన అమెరికా ఇఫ్పుడు చాలా వరకూ ఈ వైరస్ బారిన నుంచి బయటపడింది.

అంతే కాదు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు ఇక నుంచి మాస్క్ లు కూడా ధరించాల్సిన అవసరం లేదని ఇటీవల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో ఇప్పుడు చాలా వరకూ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మిగిలిన వారికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News