గంటకు 138 కోట్లు పెరిగిన మస్క్ ఆదాయం

Update: 2021-01-08 11:44 GMT

ఎలన్ మస్క్. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ప్రతిష్టాత్మక ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ టెస్లా కంపెనీతో పాటు స్పేస్ ఎక్స్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆయన సొంతం. గత ఏడాది కాలంలో ఆయన సంపద గంటకు 138 కోట్ల రూపాయల లెక్కన పెరుగుతూ పోయింది. దీంతో ఆయన తాజాగా ఇప్పటివరకూ ప్రపంచంలోనే నెంబర్ వన్ సంపన్నుడుగా ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ను దాటేశారు. గత ఏడాది కాలంగా ఎలన్ మస్క్ సంపద ఏకంగా 165 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.

ఈ విషయాన్ని బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. టెస్లా షేర్లు ఏకంగా 750 శాతం మేర లాభపడటంతో ఎలన్ మస్క్ ఈ స్థాయికి చేరుకున్నారు. బిలియనీర్ ఇన్వెస్టర్ చమత్ ఫాలియాపటియా అయితే ఏకంగాం టెస్లా షేరు ధర ప్రస్తుతం ఉన్న దానికంటే మరో రెట్లు ఎక్కువగా ఉండటానికి అర్హమైనదిగా పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో చూస్తే ఎలన్ మస్క్ సంపద మొత్తం 14,23,500 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News