కరోనా చికిత్సలో కీలక మలుపుగా భావిస్తున్న2 డీజీ సాచెట్ వచ్చేసింది. ఈ మందు ధరను ప్రకటించింది కేంద్రం. ఈ మందును కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో), డాక్టర్ రెడ్డీస్ లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మందును ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లు విడుదల చేశారు. ఇప్పుడు ఈ మందు ధర వెల్లడించారు. నీళ్లలో కలుపుకుని తాగే ఈ మందు కరోనా చికిత్సలో అద్భుతంగా పని చేస్తుందన్ని డీఆర్‌డీవో తెలిపింది. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ.990గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్‌లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే '2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)' ఔషధాన్నిడాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రం ఈ మందును డిస్కౌంట్ ధరకే అందించనున్నట్లు తెలిపారు. అయితే ఈ డిస్కౌంట్ ఎంత ఉంటుందనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.