కరోనా రెండవ దశ ఇప్పుడు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇది ఇంకా ముగియక ముందే నిపుణులు మళ్ళీ థర్డ్ వేవ్ హెచ్చరికలు చేస్తున్నారు. రెండవ దశను సమర్ధవంతంగా ఎదుర్కొకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి చెందిన శాస్త్రీయ సలహాదారు డాక్టర్ కె విజయరాఘవన్ కూడా థర్డ్ వేవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ రావటం ఖాయం అని..అది ఎక్కడ..ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పటం కష్టం అన్నారు. సుప్రీంకోర్టు సైతం దీనిపై స్పందించింది. సెకండ్ వేవ్ నే ఎదుర్కొవటంలో విఫలమైన ప్రభుత్వాలు థర్డ్ వేవ్ ను ఎలా ఎదుర్కొంటుందని ప్రశ్నించింది.
అయితే విజయరాఘవన్ తాజాగా థర్డ్ వేవ్ పై కాస్త స్వరాన్ని తగ్గించారు. అవసరమైన చర్యలు తీసుకుంటే కరోనావైరస్ మూడో దశను ఓడించగమంటూ వ్యాఖ్యానించారు. కఠిన చర్యలు తీసుకుంటే, మూడో వేవ్ అన్ని ప్రదేశాలలోనూ రాకపోవచ్చన్నారు. అంతే కాదు.. అసలు ఎక్కడా రాకపోవచ్చన్నారు. స్థానిక స్థాయిలో ఆయా రాష్ట్రాలలో, జిల్లాల్లో, ప్రతిచోటా ఎంత బాగా ఆంక్షలను, మార్గదర్శకాలను ఎంత బాగా అమలు చేస్తారనే దానిపై వైరస్ తీవ్రత ఆధారపడి ఉంటుందని విజయరాఘవన్ తెలిపారు.