పౌరవిమానయాన శాఖ దేశీయ విమాన సర్వీసుల సామర్ధ్యాన్ని పెంచింది. పండగల సీజన్...సంవత్సరాంతం హాలిడేస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనాకు ముందు వరకూ ఉన్న సర్వీసుల్లో 60 శాతం సర్వీసులను అనుమతిస్తున్నారు. ఇప్పుడు ఆ సంఖ్యను 70 శాతానికి పెంచారు. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో కూడా క్రమక్రమంగా పెరుగుదల నమోదు అవుతోంది. ఈ సంవత్సరాంతం నాటికి సాధారణ స్థితికి రావొచ్చనే పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
దీనికి తోడు ఫైజర్ ఇప్పటికే వ్యాక్సిన్ కు సంబంధించి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కన్పిస్తోంది. ముఖ్యంగా ఈ సంవత్సరాంతం నాటికి అయితే వ్యాక్సిన్లు వచ్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో విమానయాన రంగం క్రమక్రమంగా పుంజుకునే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి