హాట్ కేకుల్లా అమ్ముడు అయిన ఏడు కోట్ల ఫ్లాట్స్

Update: 2024-05-09 10:15 GMT

Full Viewడీఎల్ఎఫ్ బిగ్ డీల్. మూడు రోజులు. 795 విలాసవంతమైన ఫ్లాట్స్ . వీటి మొత్తం విలువ 5590 కోట్ల రూపాయలు. దేశంలోని దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్ఎఫ్ పూర్తి చేసిన డీల్ ఇది. ఈ డీల్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజధాని ఢిల్లీ కి దగ్గరగా ఉంటే గురుగ్రామ్ లో డీఎల్ఎఫ్ ప్రివన వెస్ట్ పేరుతో ఒక విలాసవంతమైన ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. అత్యంత విలాసవంతమైన నాలుగు బెడ్ రూమ్స్ ఫ్లాట్స్ ఇందులో ఉంటాయి. ఎన్ఆర్ఐ లతో పాటు ఇతర కస్టమర్స్ నుంచి మంచి డిమాండ్ రావటంతో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఒక్క ఫ్లాట్ ధర సుమారు ఏడు కోట్ల రూపాయలు.

ఈ విషయాలను కంపెనీ అధికారికంగానే స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్ లో వెల్లడించింది. మొత్తం 12 .57 ఎకరాల్లో డీఎల్ఎఫ్ ఈ ప్రాజెక్ట్ ను అమలు చేస్తోంది. డీఎల్ఎఫ్ ఇప్పటికే అంటే ఈ ఏడాది జనవరి లో కూడా ఇలాగే మరో ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది. అదే డీఎల్ఎఫ్ ప్రివన సౌత్ పేరుతో మొత్తం 1113 ఫ్లాట్స్ ను కూడా మూడు రోజుల్లోనే అమ్మేసింది. ఈ సేల్ ద్వారా కంపెనీ 7200 కోట్ల రూపాయలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ను 25 ఎకరాల్లో అమలు చేస్తున్నారు. కరోనా సమయంలో డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ లకు కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ కంపెనీ కీలక ప్రాజెక్టులు గురుగ్రామ్ ప్రాంతంలో ఉండటం విశేషం.

Tags:    

Similar News