విమానాల్లో అనుచిత ఘటనలు ప్రపంచం అంతా ఉన్నట్లే ఉంది. భారత్ లోనే కాదు. అగ్ర రాజ్యం అమెరికాలోనూ విమానాల్లో ఎన్నో విచిత్ర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొంత మంది ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఇతర ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. తాజాగా అమెరికా కు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ లో అసాధారణ ఘటన చోటు చోసుకుంది. పెద్ద ఎత్తున మద్యం సేవించిన ప్రయాణికుడు ఫ్లైట్ అటెండెంట్ మెడపై ముద్దు పెట్టాడు. మగ ఫ్లైట్ అటెండెంట్ కు మెడపై ముద్దు పెట్టడమే కాకుండా..నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్ చేశాడు. బలవంతంగా ప్రయాణికుడు తన మెడ పై ముద్దు పెట్టుకోవటంతో విస్తు పోవటం ఫ్లైట్ అటెండెంట్ వంతు అయింది.
అమెరికాలోని మిన్నెసోటా నుంచి అలస్కా వెళ్లే విమానాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముద్దు పెట్టుకోవటానికి ముందు ఆ ప్రయాణికుడు ఫ్లైట్ కెప్టెన్ కు భోజనం తీసుకెళుతున్న ట్రే ను కూడా ముక్కలు ముక్కలు చేశాడు. ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించిన 61 సంవత్సరాల డేవిడ్ అలాన్ బర్కు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందే ఆ ప్రయాణికుడు మద్యం సేవించాడు. తర్వాత కూడా ఒక గ్లాస్ రెడ్ వైన్ తీసుకున్నాడు. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత పైలట్ విమానంలో జరిగిన ఘటన గురించి అధికారులకు సమాచారం ఇవ్వగా...పోలీస్ లు అతడిని అదుపులోకి తీసుకున్నారు.