ఎయిర్ పోర్ట్ లో అనూహ్య ఘటన

Update: 2024-06-28 07:19 GMT

Full View

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఒక్కసారిగా కలకలం. విమానాశ్రయంలోని టెర్మినల్ వన్ లోని పైకప్పు కొంతభాగం కూలిపోవటం కలకలం రేపింది. ఈ కూలిన కప్పు ట్యాక్సీలతో పాటు పలు కార్లపై పడటంతో కొంతమందికి గాయాలు అయ్యాయి. శుక్రవారం తెల్లవారు జామున ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో టెర్మినల్ వన్ కు వచ్చే పలు విమాన సర్వీస్ లు రద్దు అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని తిరిగి గాడినపెట్టే పనులు మొదలు పెట్టారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. దేశరాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.

                                                కూలిన టెర్మినల్ భవనం 2009 సంవత్సరం లో నిర్మించారు అని...దీంతో ఇప్పుడు మొత్తం ఈ తరహా టెర్మినల్స్ లోని పరిస్థితిని తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. ఒక్క ఢిల్లీ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ పని చేస్తామన్నారు. టెర్మినల్ వన్ లో రూఫ్ కూలిపోవడానికి గల కారణాలపై నిపుణల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ నిర్వహిస్తోంది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత జీఎంఆర్ షేర్ ధర మధ్యాహ్నం సమయంలో దగ్గర దగ్గర మూడు రూపాయలు నష్టపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇతర టెర్మినల్స్ నుంచి సర్వీస్ లు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

Tags:    

Similar News