సహజంగా కార్గో లో వస్తువులు తరలిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు డబ్బు కూడా కార్గోలో వేశారు. కాకపోతే స్కానింగ్ లో ఇది దొరికిపోయింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గోలో ఏకంగా 3 .7 కోట్ల రూపాయల నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఇది ఎవరు పంపారు....ఎవరికీ పంపారు అన్న విషయాలు తేలాల్సి ఉంది. ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ఐటి అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఈ అంశంపై విచారణను ప్రారంభించారు. విమానాశ్రయాల నుంచి ఏది బయటికి వెళ్లాలన్న ఖచ్ఛితంగా స్కానింగ్ తప్పనిసరి. ఈ తనిఖీల సమయంలోనే అక్రమంగా రవాణా చేసే బంగారం తో పాటు డ్రగ్స్ కూడా పట్టుబడే విషయం తెలిసిందే. ఇప్పుడు కార్గో లో కోట్ల రూపాయల నగదు పట్టబడటం ఆసక్తి రేపుతోంది.