అమెరికాను కరోనా మరింత పీడించనుందని ఆ దేశ అంటు వ్యాధుల నిపుణుడు అంటోనీ పౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయేది అమెరికాకు చీకటి కాలమే అన్నారు. సెలవులు, విపరీతమైన ప్రయాణాల కారణంగా రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల తర్వాత కొత్త కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని..దీనికి కారణం ప్రయాణాలు పెరగటమే అన్నారు. ప్రజలు మరికొంత కాలం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అంటోనీ పౌచీ కూడా ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ టీకా తీసుకున్నారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని..అంతా పర్పెక్ట్ గా ఉన్నట్లు తెలిపారు.ఇప్పటికే అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది.. ఇప్పటికే అమెరికాలో 20 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇఛ్చారు. ఈ ఏడాది చివరి నాటికి రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.