ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి, రెండవ డోసుల మధ్య గడువు పెరిగింది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలు సంయుక్తంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అభివృద్ధ చేసిన విషయం తెలిసిందే. భారత్ లో ఈ వ్యాక్సిన్ ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది.కోవిషీల్డ్ రెండో డోసు 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇదివరకు 28 రోజుల నుంచి ఆరు వారాల వ్యవధిలో వేసుకోవాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. వాక్సిన్ బెటర్ రిజల్ట్స్ కోసం గ్యాప్ ఎక్కువగా ఉండాలని సూచించింది. కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఆరు నెలల తర్వాత యాక్షన్ తీసుకోవాలని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ (ఎన్‌టీఏజీఐ) పేర్కొంది. డెలివరీ తర్వాత తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ సూచనలు చేసింది. 12-16 వారాల మధ్య కోవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది.
కోవాగ్జిన్ డోసుల మధ్య ఎలాంటి మార్పు లేదు. కరోనా రోగులకు మాత్రం కోలుకున్న ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్ వేయాలి. ప్రస్తుతం కోలుకున్న రోగులకు 14 రోజుల తర్వాత మొదటి డోస్ ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత టీకాలు ఇచ్చినట్లయితే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన యాంటీబాడీల కార్యాచరణను పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టీకా వేయించుకునే ముందు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అవసరం లేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 12-16 వారాలకు పెంచాలి. ప్రస్తుతం, 4-8 వారాల మధ్య రెండు డోస్ ఇస్తుండగా.. లాన్సెట్ అధ్యయనం ప్రకారం, 12 వారాల విరామం ఉంటే టీకా ప్రభావాన్ని 81.3% పెంచుతుందని తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రోటోకాల్ బ్రిటన్‌లో అనుసరిస్తున్నారు.