కోవిడ్ బాధితులకు మానసిక సమస్యలు

Update: 2020-11-11 05:44 GMT

అదృష్టవశాత్తు కరోనా నుంచి చాలా మంది బయటపడుతున్నా ఈ వైరస్ బారిన పడే వారు ఎదుర్కొనే సమస్యలు రకరకాలుగా ఉంటున్నాయి. తాజాగా వెలువడిన ఓ నివేదిక సంచలన విషయాలను బహిర్గతం చేసింది. కరోనా బారిన పడిన ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. అది కూడా తొంభై రోజుల వ్యవధిలో మానసిక రుగ్మతల పాలైనట్లు తెలిపారు. లాన్సెట్ జర్నల్ లో విషయాలను ప్రచురించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అమెరికాలోని 69.8 మిలియన్ల ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చింది.

అందులో 62,354 మంది కోవిడ్ బాధితులు కూడా ఉన్నారని తెలిపారు. కోవిడ్ 19 నుంచి రికవరి అయిన వారిలో ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటివి చాలా సాదారణ అంశాలుగా ఉన్నాయని తెలిపారు. మానసిక సమస్యలు తలెత్తిన వారిలో ఈ అంశాలను గుర్తించారు. కరోనా తగ్గి చాలా మంది సాదారణ స్థితికి చేరుకున్న తర్వాత కూడా రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయనే నివేదికలు వస్తున్నాయి. కొంత మంది ఐసోలేషన్ లో ఉండటం వల్ల కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు గుర్తించారు. అయితే మానసికంగా ధృడంగా ఉండటం వల్లే ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News