బెంగుళూరులోకి ప్రవేశంపై ఆంక్షలు

Update: 2021-03-25 13:17 GMT

కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి

దేశ వ్యాప్తంగా కరోనా కథ మళ్ళీ మొదటికి వస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు వరస పెట్టి ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా బెంగుళూరులోకి ప్రవేశించాలంటే కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఆ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ వెల్లించారు. ఈ కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇంతకు ముందు పంజాబ్, చండీఘడ్, మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ నిబంధన ఉండేది.

ఇప్పుడు ప్రయాణికులు అందరికీ దీన్ని వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన గోవా కూడా ఈ దిశగానే ఆలోచన చేస్తోంది. అయితే ఇంకా ఆ రాష్ట్రం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు పెట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News